Home / ANDHRAPRADESH / టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు ఔట్..!

టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు ఔట్..!

నవ్యాంధ్రలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ముగ్గురు ఎంపీలు,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి విదితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నదీజలాల పంపకంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో గోదావరి జలాల మల్లింపుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన భూభాగంపై నుంచి కాకుండా ఏపీ మీదుగా చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు సభలో పట్టుబట్టారు. అయితే కేవలం పన్నెండు శాతం మాత్రమే గోదావరి నీళ్ళు ఏపీకి వస్తున్నాయి. నాగార్జున సాగర్ ,శ్రీశైలం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి. గోదావరి నీళ్లు మళ్లిస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ సభలో చెప్పారు. అయితే ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన వివరణ నచ్చకపోవడంతో సభలో గొడవలకు దిగిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేస్తున్నాట్లు స్పీకర్ సీతారాం తెలిపారు.