సినిమావాళ్ల, క్రికెటర్ల మధ్య అఫైర్లు, రిలేషన్ అంశాలు మనకు కొత్తేమీ కాదు. వారి మధ్య ఉన్న సంబంధాలపై ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో అనేక రూమర్లు వస్తుంటాయి. అయితే వాటిపై తారలు పెద్దగా స్పందించరు.గతంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో కేఎల్ రాహుల్‌కు అఫైర్లు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా రాహుల్ జాబితాలో మరో బాలీవుడ్ తార చేరడం చర్చనీయాంశమైంది. అయితే టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ గురించి తనపై వస్తున్న రూమర్లకు బాలీవుడ్ నటి సొనాల్ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. కేఎల్ రాహుల్‌తో డేటింగ్ అంటూ క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో డేటింగ్ చేస్తున్నారా? అంటూ అడిగిన ప్రశ్నకు సొనాల్ చౌహాన్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదు.
ఆయన మంచి క్రికెటర్. ప్రతిభావంతుడు. చాలా మంచివాడు. మా మధ్య అఫైర్ వార్తల్లో వాస్తవం లేదు. అవన్నీ మీడియా కల్పితాలే అని అన్నారు.