చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2000లో విశాఖపట్నం పరవాడలో నెలకొల్పిన రాంకీ ఫార్మాకు వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రీన్ బెల్ట్ ఏరియాను 50 కిలోమీటర్లకు కుదించడం వలన జగన్ కంపెనీలలో 10 కోట్లు పెట్టుబడి పెట్టారు అనే సీబీఐ ఆరోపణ నిజమని నమ్మి జప్తు చేసిన 10 కోట్ల సొమ్మును విడుదల చేయండి అని ఈడీని ఆదేశించిన ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్.కేవలం సీబీఐ చెప్పింది అని కాకుండా సొంతగా ఎలాంటి ఆధారాలు లేకుండా జప్తు చేయడం తప్పు అని చెప్పింది. ఇంతకుముందు పెన్నా సిమెంట్స్ వాళ్ళు వైఎస్ ప్రభుత్వం వలన ఒక కోటి లబ్ది పొంది 45కోట్లు పెట్టుబడి పెట్టారు అన్న సీబీఐ ఈడీల వాదనను బుద్డిన్నోడు ఎవడైనా కోటి లబ్ది కోసం 45 కోట్లు పెడతాడా అని కోర్ట్ ఆ కేసును కొట్టేసింది.
ఏది ఏమైనా జగన్ ను ఎదుర్కులేక సోనియా చంద్రబాబు కలిసి కుట్ర తో పెట్టిన కేసులు ఒక్కొకటి తేలిపోతున్నాయి. దీంతో బాబుకు ఒక క్లారిటీ కూడా వచ్చేసిందని చెప్పాలి. జగన్ ని ముట్టుకుంటే మనకే ప్రమాదం అని ఈపాటికే బాబుకి అర్దమై ఉంటుందని అనుకుంటున్నారు. మొన్ననే జగన్ మొఖం చూసి వరల్డ్ బ్యాంకు వెనక్కు పోయింది అని కుల మీడియా కోడై కోసింది కానీ వరల్డ్ బ్యాంకు వాళ్ళు అక్కడ రాజధాని రైతుల అభ్యంతరాలు పెడుతున్నారు కాబట్టి సొంతంగా మా బ్యాంకు దర్యాప్తు చేస్తుంది అని అంటే కేంద్రం ఒప్పుకోలేదు కాబట్టి అమరావతికి డబ్బులు ఇవ్వం కానీ ఇతర ప్రాజెక్ట్ లకు ఇస్తాము అని చెప్పింది వరల్డ్ బ్యాంకు.