తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్(60) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్ గౌడ్.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
తుదిశ్వాస విడిచారు. ముఖేష్ గౌడ్ మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.
కార్పోరేటర్ నుండి మంత్రిగా మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ ప్రస్థానంపై ఒక లుక్ వేద్దాం
1959, జులై 1వ తేదీన జన్మించారు.
ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు
గత 30 ఏండ్ల నుంచి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు
యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలందించారు
జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ గా కూడా పని చేశారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు..
1989లో తొలిసారి మహారాజ్ గంజ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2004లో కూడా అదే నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపొందారు.
2009లో గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2009లో గెలిచిన తర్వాత వైఎస్ కేబినెట్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా
