ఏపీ యువముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. ప్రస్తుతం నవ్యాంధ్ర పర్యటనలో ఉన్న జపాన్ దేశ కాన్సులేట్ జనరల్ కొజిరో ఉచియామ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి జగన్ గత యాబై రోజులుగా ఎటువంటి అవినీతిలేకుండా అందిస్తున్న పాలన గురించి.. సంబంధిత శాఖల పనితీరుపై వీరికి వివరించారు. అంతేకాకుండా నవ్యాంధ్ర పరిశ్రమలకు ఎలా ఉపయోగకరమో.. తమ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అందించే ప్రోత్సహాకాల గురించి .. జపాన్ లాంటి దేశాలు తమ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు చాలా సానుకూలమని ఆయన వివరించారు. ఈ సందర్భంలో తమ దేశంలో పర్యటించాలని ముఖ్యమంత్రి జగన్ ను ఉచియామ కోరారు.
