మరో ముడురోజుల్లో మహేష్ ఫాన్స్ కు పండుగ అని చెప్పాలి ఎందుకంటే..ఆగష్టు 9 అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. తన పుట్టినరోజు సందర్భంగా మహేష్ తన అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వనున్నాడు. అదేమిటంటే ‘సరిలేరు నికేవ్వరు’ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో హీరో మహేష్, హీరోయిన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నికేవ్వరు’. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో విజయశాంతి, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
