నవ్యాంధ్రలో పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ కు వైసీపీ సర్కారు పిలుపునిచ్చిన సంగతి విదితమే. అయితే వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు పోలవరం ప్రాజెక్టు పరిధిలోని హైడల్ ప్రాజెక్టుకు సంబంధించిన హెడ్ వర్క్ పై మాత్రమే రివర్స్ టెండరింగ్ కెళ్ళోద్దని తీర్పునిచ్చింది కానీ పోలవరం పనులు ఆపేయమని కాదు అని ప్రభుత్వ లాయర్లు మీడియాతో తెలిపారు. అయితే కోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేతలు వక్రీకరిస్తూ విమర్శలు చేస్తోన్నారు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు..
