Home / ANDHRAPRADESH / టీడీపీ ఎమ్మెల్యేపై తిరగబడిన వరద బాధితులు

టీడీపీ ఎమ్మెల్యేపై తిరగబడిన వరద బాధితులు

నవ్యాంధ్రలో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు చుక్కెదురైంది. ఈ రోజు గురువారం పెనుమూడిపల్లెపాలెంలో వరద సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ జనాన్ని రెచ్చగొట్టిన ఆయన ప్రజల చేతిలో అభాసుపాలయ్యారు.

అక్కడ వరద సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ జనాన్ని రెచ్చగొట్టారు. దీంతో ఆయనపై తిరగబడ్డ జనం అసలు మీరేం చేశారో చెప్పాలంటూ నిలదీశారు.

గత ఐదేళ్లలో ఒక్కసారైనా మా ఊరు వచ్చారా అంటూ ప్రశ్నించారు. వరదలు వస్తే ప్రభుత్వం భోజనం పెట్టి ఆదుకుందని గ్రామస్తులు తెలిపారు. అనవసర రాజకీయాలు చేయొద్దని ఎమ్మెల్యేకు హితవు పలికారు. గ్రామస్తులు ఆగ్రహించటంతో చేసేదేమీలేక టీడీపీ ఎమ్మెల్యే అనగాని అక్కడినుంచి వెళ్లిపోయారు.