Home / ANDHRAPRADESH / రాజధాని మార్పుపై మంత్రి గౌతమ్ రెడ్డి క్లారీటీ..!

రాజధాని మార్పుపై మంత్రి గౌతమ్ రెడ్డి క్లారీటీ..!

నవ్యాంధ్ర రాజధానిని అమరావతి నుండి వైసీపీ సర్కారు తరలిస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీకి చెందిన నేతలు విషప్రచారం చేస్తోన్న సంగతి విదితమే.ఈ క్రమంలో రాజధాని మార్పుపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి క్లారీటీచ్చారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ”ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని  క్లారిటీ ఇచ్చారు. రాజధాని తరలిస్తున్నట్లు బొత్స చెప్పలేదన్నారు. శివరామకృష్ణ కమిషన్‌ చెప్పిందే బొత్స చెప్పారని పేర్కొన్నారు.

ఇటీవల రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అమరావతిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.