తెలంగాణలో ఇప్పుడో సరికొత్త ఛాలెంజ్ తెలంగాణలో సందడి చేస్తోంది. అదే గ్రీన్ ఛాలెంజ్..! మూడు మొక్కలు నాటి…మరో ముగ్గురికి సవాల్ విసరాలి. ఇప్పుడు తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ పేరుతో చెట్లను నాటడంతో పాటు ఇతరులతో నాటించే బృహత్తర కార్యక్రమం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అటవీ సంపదను పెంచి, కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో హరితహారం చేపడుతోంది. ఇందులో రాజకీయ, సినీ,క్రీడా, సామాన్య ప్రజల్నిభాగస్వామ్యం చేసి వారితో చెట్లు నాటించడానికి పుట్టుకొచ్చిందే గ్రీన్ ఛాలెంజ్ కాన్సెప్ట్.
ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు చురుగ్గా పాల్గొంటున్నారు. మొక్కలతో సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒకరికొకరు హరిత సవాల్ విసురుకుంటూ…పచ్చదనం పెంపొందించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. తెలంగాణ హరితహారంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసేందుకు గాను… మూడు మొక్కలు నాటండి..
మరో ముగ్గురి చేత మూడు మొక్కలు నాటించండి అనే నినాదం ఇప్పుడు బాగా ప్రచారం పొందుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించి.. మరికొందరికి సవాల్ విసిరారు. తాజాగా వర్థన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, హరిత గార్లకు, జీడబ్ల్యుఎంసీ కమీషనర్ రవి కిరణ్ గారికి గ్రీన్ చాలెంజ్ విసిరారు.