విశాఖ టీడీపీ వలసలతో వణికిపోతోంది.. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసారు. తాజాగా విశాఖకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు టీడీపీకి షాకిచ్చారు. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరోవైపు ఇవాళ అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా జిల్లాలో మాజీమంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. అయితే లోకేష్ పర్యటన రోజునే సన్యాసిపాత్రుడు రాజీనామా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కుటుంబంకంటే తెలుగుదేశమే నాకు ప్రాధాన్యత అని తెలుగు దేశానికి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత ప్రతీ తెలుగుతమ్ముళ్లపై ఉందని ఇటీవల అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చినా ఆమాటను ఏమాత్రం లెక్కచేయకుండా సన్యాసిపాత్రడు టీడీపీని వీడారు. టీడీపీ విధానాలు నచ్చకపోవడం, భవిష్యత్తులోనూ టీడీపీ పుంజుకునే అవకాశం లేకపోవడంతో కచ్చితంగా పార్టీ మారాలని నిర్ణయించుకున్నారట. భారీగా తన అనుచరులతో వైసీపీలో చేరుతున్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. ఈక్రమంలో ఇప్పటికే పార్టీకి ఏమాత్రం బలం లేని విశాఖ వలసలతో వణికిపోతుంది. వైసీపీలోకి మరిన్ని చేరికలు ఉండడంతో టీడీపీ మరింత బలహీనపడుతుంది.
