తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉందని ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,బీజేపీ,టీడీపీలకు చెందిన విషప్రచారం చేస్తోన్న సంగతి విధితమే. యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తోన్న విషప్రచారాన్ని తిప్పికొట్టారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాజధాని మహానగరం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ”తెలంగాణలో ఎక్కడ ఎరువుల కొరత మరి ముఖ్యంగా యూరియా కొరత లేదు.
ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లడానికి ఇలాంటి ప్రచారం చేస్తుందని ఆయన తిప్పికొట్టారు. యూరియా కొరత రాకుండా ఉండాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో గత నెల ఆగస్ట్ నెలలో కంపెనీల నుంచి 1.12లక్షల మెట్రిక్ టన్నులు..మార్క్ ఫైడ్ బఫర్ స్టాక్ నుంచి అందుబాటులోకి 1.25లక్షల మెట్రిక్ టన్నులను సేకరించాము.
బుధవారం వరకు అన్నిజిల్లాలకు 15వేల మెట్రిక్ టన్నులు చేరవేశామని ఆయన తెలిపారు. అయితే దుబ్బాక నియోజకవర్గంలో రైతు గుండెపోటుతో మరణించారు అని .. ఎరువుల కోసం క్యూలో నిలబడి కాదు అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు..