ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మొదటినుంచీ మతపరంగా ప్రత్యర్ధ పార్టీలు విషం కక్కుతూనే ఉన్నాయి. కొందరు ఏకంగా జగన్ సీఎం అయితే తిరుమలలో అంతా క్రిస్టియన్లే ఉంటారు.. హిందువులు ఉండరు అన్నారు. అయితే ఇప్పుడు కేవలం తిరుమలలోనే కాదు.. ఎక్కడా హిందూ దేవాలయాల్లో కూడా సీఎం జగన్ అన్య మతస్థులు లేకుండా చేశారు.. గతంలో చంద్రబాబు చాలా సందర్భాల్లో బూట్లు వేసుకొని పూజలు చేసినా, విజయవాడలో పుష్కరాల సమయంలో 50 గుళ్ళు కూల్చివేసినా, సదావర్తిలో దేవుడి భూములు కాజేసినా, పింక్ డైమండ్ అపహరించినా, శ్రీవారి నగలు మాయం చేసినా, ఆర్టీసీ టికెట్ ల మీద అన్యమత ప్రచారంచేసినా తిరుమల బస్సులకు పంపినా ఎవరూ కనీసం కిమ్మనలేదు. జగన్ మాత్రం కేవలం తిరుమలలోనే కాదు.. రాష్ట్రంలో ఎక్కడా ఎవ్వరూ హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులు పనిచేయవద్దు.. స్వచ్ఛంధంగా వెళ్లిపోవాలని కోరడం నిజంగా హిందూ ధర్మం పట్ల జగన్ కు ఉన్న నిబద్ధతకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
