Home / SLIDER / పచ్చదనంతోనే మనుగడ

పచ్చదనంతోనే మనుగడ

రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ యువ నాయకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ మూడు కోట్లకు చేరింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో సంతోష్ కుమార్ మూడు కోట్లవ మొక్కను నాటారు. జీహెచ్ ఎంసీ కి చెందిన ఎన్ఫోర్స్ మెంట్ , విజిలెన్స్ డైరెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. సంతోష్ కుమార్ తో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ పాల్గొని ఆ తర్వాతి మొక్కలు నాటారు. తెలంగాణకు హరితహారంలో తమ వంతు భాగస్వామ్యం ద్వారా పచ్చదనం పెంచాలన్న ఆశయంతో ఎం.పీ సంతోష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను స్వయంగా మొక్క నాటుతూ, మరో ముగ్గురిని నామినేట్ చేసి మొక్కలు నాటాల్సిందిగా కోరటమే ఈ గ్రీన్ ఛాలెంజ్. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అనూహ్య స్పందన పొందిన కార్యక్రమం గ్రీన్ ఛాలెంజ్. రాజకీయ నేతలు, అధికారులు, సామాన్య పౌరులు, ఇలా అందరూ భాగస్వామ్యులై మొక్కలు నాటడంతో అనతికాలంలోనే మూడు కోట్ల మొక్కలకు గ్రీన్ ఛాలెంజ్ చేరుకుంది. నాటిన మొక్కతో సెల్ఫీ దిగి పోస్ట్ చేయటం సోషల్ మీడియాలో కూడా ఒక సంచలనంగా మారింది. అదే సమయంలో జాతీయ స్థాయిలోనూ ఈ కార్యక్రమం ప్రశంసలు పొందింది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు పార్టీల నేతలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక అధిపతులు, సినిమా నటులు, క్రీడా కారులు కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. పచ్చదనం పెంచే సదాశయంలో తమను కూడా భాగం చేసినందుకు ఎం.పీ సంతోష్ కు భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని, మానవ మనుగడకు ఆధారమైన పచ్చదనం పెంపు కార్యక్రమం
తెలంగాణకు హరితహారంలో ప్రతీ ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఎం.పీ సంతోష్ కుమార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పచ్చదనం పెరిగి తెలంగాణ అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా మారాలనేది సీఎం కేసీయార్ ఆకాంక్ష అని ఆ దిశగా పనిచేస్తామన్నారు.

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటి, వాటిని సంరక్షించేవారిని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ వనమిత్ర పేరిట ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్లు ఇగ్నటింగ్ మైంట్స్ సంస్థ నిర్వాహకులు కరుణాకర్ రెడ్డి తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్ ద్వారా పది కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో IPS అధికారి, డైరెక్టర్ EV&DM విశ్వజిత్, జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ముషార్రఫ్, రామ్ గోపాల్ పేట కార్పోరేటర్ అత్తెల్లి అరుణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇగ్నటింగ్ మైండ్స్ ప్రతినిధి రాఘవ కార్యక్రమం సమన్వయ కర్తగా వ్యవహరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat