భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్ పై ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఇటీవల పాకిస్థాన్ టూర్ కెళ్లాడు. దాని గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ” పాక్ పర్యటనకెళ్ళిన నాకు పాకిస్థాన్ ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది.
అక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అక్కడ పరిస్థితుల గురించి మన దేశంలో అనుకున్నట్లు లేదు. రాజకీయ కారణాల కోసమే కేంద్రం పాకిస్థాన్ పై విమర్శలు చేస్తుంది అని ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రజలు భారతీయులను తమ సొంత బంధువుల్లా చూసుకుంటున్నారు అని ఆయన అన్నారు.