సినిమా ఇండస్ట్రీ అంటేనే లైంగిక వేధింపులు అని అందరూ అంటుంటారు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి బడా హీరోయిన్ వరకు అందరూ ఏదోక దశలో ఈ సంఘటనలకు బాధితులవుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్
హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించి వీర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జరీన్ ఖాన్.
సల్మాన్ ఖాన్ అండదండలతో ఈ ముద్దుగుమ్మ చాలా చిత్రాల్లో నటిస్తుంది. అంత పెద్ద స్టార్ హీరో అండదండలున్న కానీ నేను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కున్నాను అని ఆమె సెలవిచ్చారు. ఒక పేరు గాంచిన దర్శకుడు తన చిత్రంలోని కిస్ సీన్స్ కోసం ప్రాక్టీస్ కోసం తన ఇంటికి రమ్మని వేధించాడని ఈ ముద్దుగుమ్మ బాంబు పేల్చింది.
అంతేకాకుండా దర్శకులతో నిర్మాతలతో అలా సన్నిహితంగా ఉంటేనే మూవీల్లో అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీలో చాలా మంది సలహాలు ఇచ్చారు. కానీ నేను అవేమి పాటించలేదు .. పట్టించుకోలేదని అమ్మడు
చెబుతూ వచ్చారు..