Home / SLIDER / ధోని తప్పుకో.. సీనియర్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు.

ధోని తప్పుకో.. సీనియర్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు.

టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ ఆటగాళ్లు,క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే.

తాజాగా సీనియర్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”బీసీసీఐ పక్కకు పెట్టకుముందే ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి తప్పుకోవాలి.

ధోనీ రిటైర్మెంట్ కు సమయం ఆసన్నమైంది. అతని రిటైర్మెంట్ పై అతనే నిర్ణయం తీసుకోవాలి. తన భవిష్యత్తు ప్రణాళికలను ధోనీ వెల్లడించాలి. వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్ సమయానికి ధోనీ వయస్సు ముప్పై తొమ్మిదేళ్లకు చేరుతుందని”అన్నాడు.