తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు అంటే అది ఎస్.ఎస్ రాజమౌళి నే. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతీని పెంచీసాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం చూస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక అసలు విషయానికి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం జక్కన్న ఈ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ తో సినిమా తీయనున్నాడని సమాచారం. అసలైతే అప్పట్లో మహేష్ జక్కన్నను బాహుబలి రేంజ్ లో సినిమా తీయమని అడిగాడట. అయితే జక్కన్న ఆ రేంజ్ చిత్రం ఇక ఉండదని చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పుడు రాజమౌళి తీయబోయే తరువాత సినిమాలో మహేష్ ను మునుపెన్నడూ చూపించని రీతిలో చూపించనున్నాడు. అది ఎలా అంటే హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ లెక్క. ఆ మాట వినడంతో ఒక్కసారిగా మహేష్ ఫ్యాన్స్ కు ఎక్కడలేని ఆనందం వచ్చేసింది.
