ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఓ రేంజులో విరుచుకుపడుతుంది. ముఖ్యంగా పోలవరం ఆపేస్తారని అది కరెక్ట్ కాదు అంటూ విమర్శించింది. అయితే జగన్ ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు చకచకా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. నాలుగేళ్లలో జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగిలిన పనులు ఖర్చు ఆధారంగా ప్రాజెక్టులను వర్గీకరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లు అందించేలా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు. నాబార్డ్ నుంచి రుణ సమీకరణ చేసి పెండింగ్ ప్రాజెక్టుల పనులను పూర్తి ప్రణాళిక ఏర్పాటు చేశారు. జగన్ నిబద్దతకు నాబార్డ్ ఇప్పటికే రెండు వేల కోట్ల రుణాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జగన్ సూచనలు మేరకు ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
