టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ టెస్ట్ మ్యాచుల్లో అత్యంత వేగంగా 200వికెట్లను పడగొట్టిన ఎడమచేతి వాటం బౌలర్ గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఏపీలోని విశాఖపట్టణంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓపెనర్ డేన్ పీడ్త్ ఎల్గర్ ను ఔటు చేయడంతో మొత్తం నలబై నాలుగు టెస్టు మ్యాచుల్లో రెండోందల వికెట్లను దక్కించుకున్న ఆటగాడిగా పేరుగాంచాడు. అంతకుముందు శ్రీలంక ఆటగాడు హెరాత్ నలబై ఏడు మ్యాచుల్లో ఈ ఘనతను సాధించాడు.
