తాజాగా వినాయక్ ఫోటో షూట్ చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలలో పోస్ట్ చేసారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ తో డ్రెస్సింగ్ కూడా చిరుని పోలి ఉంది. దీంతో అందరూ మీరు హీరోగా చేస్తున్నారా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అది నిజమే అని క్లారిటీ వచ్చేసింది. సీనయ్య సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు గాను నరసింహ దర్శకత్వం వహించగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈరోజు వినాయక్ పుట్టినరోజు సందర్భంగా తన సినిమాకు దర్శకేంద్రుడు క్లాప్ కొట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు అందరూ హాజరయ్యారు మరియు దిల్ రాజు కూడా పాల్గొన్నాడు. మరి డైరెక్టర్ హీరోగా నటిస్తున్నాడు అంటే అది ఎలా ఉండబోతుందో మరి..?