తెలంగాణలోని అన్ని పల్లెలు,గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం పల్లె ప్రగతి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముప్పై రోజుల ప్రణాళికను ఎంతో విజయవంతంగా గ్రామ సర్పంచులు,వార్డుమెంబర్లు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు.
దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమానికి రూ.64కోట్లను విడుదల చేసింది. రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా మిగతా ముప్పై రెండు జిల్లాలకు రెండు కోట్లు చొప్పున మొత్తం ఆరవై నాలుగు కోట్లను విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు.