మంగళగిరి 1500కోట్లు.. మాదాపూర్ చేస్తానన్న వ్యక్తి అక్కడే రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఆర్కే డెవలప్ చేస్తున్నాడు
sivakumar
October 14, 2019
ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,488 Views
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానిపై తన బృహత్ ప్రణాళికను ముందుగానే వెల్లడించినట్టుగా రాజధాని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరికి పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు. తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీల్లో పదిహేను వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. తాడేపల్లి నుండి దేవేంద్ర పాడు వరకు వంద అడుగుల రోడ్డు, బకింగ్హమ్ కెనాల్ పై ఏకంగా నాలుగు రోడ్లు వేయనున్నారు. ఈ కాలువ పై నాలుగు వంతెనలు వేసి అప్పుడు రోడ్లు వేస్తారు. అలాగే కుంచనపల్లి నుంచి చిర్రావూరు వరకు మరో ముఖ్యమైన రోడ్డును వేయనున్నారు. ఈ క్రమంలో తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీ లో చుట్టూ ఉన్న అనేక గ్రామాలను ఈ రెండు మున్సిపాలిటీలో కలిపి వాటికి సమానంగా అభివృద్ధి చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన నారా లోకేష్ మంగళగిరి ని మాదాపూర్ గా చేస్తానన్నారు. కానీ ఆళ్ల అలాంటి హామీ ఇవ్వలేదు. ఇపుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో ఆళ్ల కృషితో మంగళగిరి మాదాపూర్ ని మించిన ప్రాంతం కాబోతోంది.
Post Views: 232