బన్నీ మరియు మహేష్ చిత్రాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానున్నాయి. ఈమేరకు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరోపక్క వెంకటేష్, నాగ చైతన్య నటిస్తున్న చిత్రం వెంకీ మామ. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుందని తెలుస్తుంది. ఒకవేళ అదేగాని నిజమైతే ఈ బడా హీరోలకి దెబ్బ పడినట్టే అని చెప్పాలి. ఎందుకంటే ముందురోజు వెంకీ మామ రిలీజ్ అయితే స్క్రీన్ లు విషయంలో చాలా ఇబ్బందులు పడాలి. మరి ఈ డేట్ నే ఫిక్స్ అవుతారో లేదా మారుస్తారా అనేది వేచి చూడాల్సిందే.
