ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు నవరత్నాలను ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. గతంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చినప్పుడు కూడా ఇష్టం ఉన్నవారు జాయిన్ అయ్యారు ఇష్టంలేని వారు జాయిన్ కాలేదు అది వారి పర్సనల్ అంశం. అయితే చంద్రబాబునాయుడు ఒకటికి పది సార్లు ప్రెస్మీట్లు పెట్టి అనేకసార్లు గ్రామ వాలంటీర్ల విషయం గురించి మాట్లాడారు. ముఖ్యంగా గ్రామ వాలంటీర్లు తప్పుడు పనులు చేసిన రెండు చౌకబారు విమర్శలు కూడా చేశారు. దాంతో మామూలుగా ఉన్న వాలంటీర్లు బయటకు వచ్చి మరి ఈ వృత్తి ఎంత ముఖ్యమైనదో ప్రజాసేవ ఎంత గౌరవం చెప్పి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఉన్న గౌరవాన్ని మరింత పెంచారు.
అలాగే సోషల్ మీడియా పై పెడుతున్న కేసుల విషయంలో చంద్రబాబు అనేక సార్లు ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెట్టిన అక్రమ కేసులను మరోసారి చర్చకు వచ్చాయి. ఇప్పుడు పెడుతున్న కేసులను కూడా ప్రభుత్వం పై దుష్ప్రచారం చేసిన కేసులు మాత్రమే కావడంతో ప్రజలు ఆ విషయాన్ని కూడా గ్రహించారు. పెన్షన్ పెంపు అంశాన్ని కూడా చంద్రబాబు ఇదేవిధంగా రాద్ధాంతం చేయాలని చూశారు. అయితే నాలుగేళ్లపాటు పెంచకుండా అప్పటికప్పుడు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఎన్నికలకు ముందు పెంచడం వంటివి ప్రజలు స్పష్టంగా గమనించారు. అయితే జగన్ ముఖ్యమంత్రి కాగానే సంతకం పెట్టడం తో ఆ విషయాన్ని రాద్ధాంతం చేద్దాం అనుకున్న చంద్రబాబుకు అది కూడా కుదరలేదు. అయితే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పథకానికి సంబంధించి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తో పాటు టీడీపీలో ఉన్న అతి కొద్ది మంది అనేక సార్లు ప్రెస్మీట్లు పెట్టి వాళ్లే జగన్ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నారని వాదన కూడా వినిపిస్తోంది.