టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో రాంచీ వేదికగా సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో డికాక్,డుప్లెసిస్ ,లిండేల వికెట్లను తీశాడు.
దీంతో వరుసగా ఐదు ఇన్నింగ్స్ లలో మూడుకిపైగా అంతకంటే ఎక్కువ వికెట్లను తీసిన రెండో బౌలర్ గా ఉమేష్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. గతంలో విండీస్ దిగ్గజ ఆటగాడు కోట్నీ వాల్స్ ఈ ఘనతను సాధించగా తాజాగా ఉమేష్ యాదవ్ ఈ ఫీట్ ను సాధించాడు.
ఉమేష్ తన చివరి ఐదు ఇన్నింగ్స్ లలో వరుసగా 6/88,4/45,3/37,3/22,3/40 లతో రాణించాడు.