తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన సిబ్బంది కొంతమంది ఆత్మహాత్యకు పాల్పడ్డారు. మరికొంతమంది గుండెపోటుతో చనిపోయారు.
దీంతో ఆర్టీసీ కార్మికుల ఆత్మహాత్యకు ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డినే ప్రధాన కారణమని హైదరాబాద్ మహనగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ డ్రైవర్ రాజు పిర్యాదు చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదు.
ఉద్యోగులకు,సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెబుతున్నా కానీ అశ్వత్థామరెడ్డి వినకుండా కార్మికులను సమ్మె అంటూ పక్కదారి పట్టిస్తున్నాడు. వాళ్ల ఆత్మహత్యలకు కారణమవుతున్నాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. రాజు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.