తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు భారీ ప్రమాదం తప్పింది. నిన్న సోమవారం సాయంత్రం మాజీ మంత్రి పొన్నాల కారు ప్రమాదానికి గురైంది.
అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాద ఘటన జరగడానికి ముందే కారులో నుంచి దిగి మాజీ మంత్రి పొన్నాలతో పాటు ఆయన మనవడు దిగి షాప్ లోకి వెళ్ళారు. వాళ్లు లేనప్పుడు ఈ ఘటన జరగడంతో భారీ ప్రమాదం నుంచి ఆయన.. ఆయన మనవడు బయటపడ్డారు.
తన మనవడుతో కలిసి జూబ్లిహీల్స్ రోడ్ నెంబర్ 1 వైపు షాపింగ్ కు వచ్చిన సమయంలో అదే సమయంలో సినిమా షూటింగుకి చెందిన వాహానం రివర్స్ తీసుకునే క్రమంలో అది పొన్నాల కారు ముందు భాగాన్ని గట్టిగా ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది.