వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయి 150 రోజులు పూర్తయిన సందర్భంగా రూరల్ ఇండియా అనే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో మొత్తం 70 శాతం మంది ప్రజలు జగన్ పాలన ఎంతో బాగుంది అన్నారు మిగిలిన 30 శాతం మంది పాలన బాలేదు అన్నారు. ముఖ్యంగా వాస్తవంగా కూడా కనిపిస్తున్న కొద్దిపాటి సమస్యలే జగన్ పాలన బాగాలేదు అన్న 30 శాతం మంది ప్రజలు చెప్పిన వాటికి కారణాలు. నూతన ఇసుక విధానం మీ ఇంటికే తక్కువ ధరకే ఆన్లైన్లో ఇసుక లభిస్తుందని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి రాష్ట్రంలో ఇసుక సమస్య చాలా ప్రాంతాల్లో ఉంది, అలాగే జగన్ పాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో విద్యుత్ కోతలు అధికమయ్యాయి, మరోవైపు జగన్ తన మానస పుత్రికగా అత్యంత ఇష్టపూర్వకంగా ప్రవేశపెట్టిన స్పందన అనే కార్యక్రమం అన్ని స్థాయి ప్రజలకు చేరడం లేదు.. ఈ మూడు అంశాలపై రాష్ట్రంలోని చాలా తరగతుల ప్రజలు జగన్ పాలన పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అయితే పెన్షన్ల పెంపు, ఆరోగ్యశ్రీ అమలవుతున్న తీరు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ఇచ్చిన లక్షల ఉద్యోగాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ , ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు మహిళలకు 75000 కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే అంశం, రాష్ట్రవ్యాప్తంగా చక్క చక్క అమలవుతున్న ఉగాది నాటికి ఇల్లు కేటాయించే పథకం, ఆన్లైన్ లోన్లు వంటి పథకాలతో ప్రజల గుండెల్లో జగన్ చెరగని ముద్ర వేసుకున్నారు. ఉన్న సమస్యలను అధిగమించి పరిపాలనలో ఐదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఏమాత్రం అనుభవం లేని ఓ యువ ముఖ్యమంత్రి ఆర్థికంగా ఉన్నత కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం పట్ల ఆనందిస్తున్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల అమలు పాలనలో పారదర్శకత పోలవరం రివర్స్ టెండరింగ్ వంటివాటిపై జగన్ను మెచ్చుకుంటున్నారు. మొత్తంగా అతి తక్కువ వయసులో అతి తక్కువ కాలంలో 70 శాతం మంది ప్రజల సంతృప్తిపరిచే విధంగా జగన్ పాలన ఉండడం మంచి పరిణామం.