వినడానికి వింతగా ఉందా..?. టాలీవుడ్ స్టార్ హీరో.. కొన్ని కోట్ల మందికి ఆరాధ్యదైవమైన హీరో ..స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఏంటీ ఎర్ర చందనంపై మోజు పడటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అయితే ఇక్కడ అసలు కథ ఏంటీ అంటే ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఒక కథను టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు విన్పించాడు.
ఈ కథ తనకు నచ్చకపోవడంతో మహేష్ సుకుమార్ తో ఈ కథతో మూవీకి రెడ్ సిగ్నల్ ఇచ్చాడు . దీంతో చేసేది ఏమి లేక సుకుమార్ తన దగ్గర ఉన్న కథను స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కు విన్పించాడు. కథ నచ్చడంతో కాస్త మార్పులు చేర్పులు చేసి తీద్ధామని బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అయితే ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించినది ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్రం యొక్క పూజా కార్యక్రమాలు అయ్యాయి అని కూడా ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తోన్నాయి. సో బన్నీ లేటెస్ట్ మూవీ ఎర్రచందనం గురించి అన్నమాట.