మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నిన్న నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన ఈ దీక్ష చేసారు.ఈ దీక్షపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తండ్రీకొడుకులకు చురకలు అంటించారు.”చిరుతిండ్లు లేకుండా నాలుగు గంటలు కూర్చున్న మాలోకానికి నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేయడమేంటి? పిచ్చి కాకపోతే. గట్టిగా తినొచ్చుంటాడు. ముఖంలో అలసట కూడా కనిపించడం లేదని వార్తలు చూసిన ప్రజలనుకుంటున్నారు. నిరాహార దీక్షలకు గౌరవం లేకుండా చేస్తున్నారు కదయ్యా తండ్రి, కొడుకులిద్దరూ” అని మండిపడ్డారు. అంతకముందు రోజు వర్మ ఒక ఇంటర్వ్యూలో లోకేష్ విషయంలో మాట్లాడిన మాటలు ఎవ్వరూ మర్చిపోలేరని చెప్పాలి.
