శృతీ హాసన్ ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు చూడగానే ఆకట్టుకునే సౌందర్యం.. ఇంకోవైపు చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. యువత గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన ముద్దుగుమ్మ.
ఇలాంటి అందాల రాక్షసి గత కొంతకాలంగా టాలీవుడ్ లో సరైన హిట్ లేక సతమతవుతుంది.ఇలాంటి తరుణంలోనే ఈ ముద్దుగుమ్మకు నేనున్నాంటూ బిగ్ ఆఫర్ ఇచ్చాడు ఓ స్టార్ హీరో. ఆ స్టార్ హీరోనే గతంలో బలుపుతో అమ్మడికి సరైన్ హిట్ అందించిన మహారాజ్ రవితేజ.
గతంతో బలుపు,డాన్ శ్రీన్ మూవీలతో డబుల్ హిట్ అందించిన గోపిచంద్ మలినేని తాజాగా మాస్ మహారాజ్ తో ముచ్చటగా మూడో చిత్రాన్ని తీయబోతున్నాడు. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా శృతీ హాసన్ ను ఎంపిక చేస్తున్నట్లు ఈ చిత్రం యూనిట్ ప్రకటించింది. ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.