మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఘోరంగా ఓడినప్పటినుండి ఇప్పటికి వరకు చేసిన పని ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే. తానూ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేని పనులను జగన్ వచ్చిన 5నెలల్లోనే చేసి చూపిస్తే చూసి తట్టుకోలేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన టీమ్ ను ఒక్కొక్కరిగా జగన్ పైకి వదులుతున్నాడు. చివరికి వారు విఫలం కాక తప్పడం లేదు.చివరిగా తన దత్తపుత్రుడు అని పిలవబడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా వైజాగ్ వేదికగా పంపాడు. చివరికి అది కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో మళ్ళీ మొదటికే వచ్చిందని చెప్పాలి. దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మండిపడ్డారు. “మళ్లీ అవే ఏడుపులు. అమరావతి, పోలవరం, మచిలీపట్నం పోర్టు, నవయుగకు అన్యాయం, పిపిఏల సమీక్ష, కాంట్రాక్టర్ల బిల్లులు. ఎంత సేపు తన అవినీతి ఎక్కడ బయట పడుతుందోనన్న టెన్షనే తప్ప 4 లక్షల ఉద్యోగాల గురించి, ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం గురించి ఒక్క మాట మాట్లాడే దమ్ములేదు.
