2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన విషయం ఎంత వాస్తవమో…ప్రజలను నమ్మించి మోసం చేసాడు అన్నది కూడా అంతే వాస్తవం అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి వారికి ఆశ చూపెట్టి…చివరికి గెలిచాక చేతులెత్తేశారు. కనీసం ప్రజలు పట్ల జాలి చూపలేదు. ప్రభుత్వాన్ని తన సొంత పనులకే వాడుకున్నారు తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఇంత చేసిన చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న ప్రజలు ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు.ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అయినప్పటికీ తాను ఎందుకు ఓడిపోయాను అర్దంకావడంలేదు అని అంటున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “కిందటి ఎన్నికల్లో ఓటమికి కారణం అన్ని వర్గాల ప్రజలు దూరమవడమేనని చంద్రబాబు గారు ఇంకోసారి అంగీకరించారు. మధ్య మధ్య కాస్త కన్ఫ్యూజ్ అయి ఇలా వాస్తవాలు తనకు తానే బయట పెడుతుంటాడు. ఎందుకు ఓడిపోయానో తనకు అర్థం కావడం లేదని మొన్నటి వరకు గోల పెట్టాడు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది”అని అన్నారు.
కిందటి ఎన్నికల్లో ఓటమికి కారణం అన్ని వర్గాల ప్రజలు దూరమవడమేనని @ncbn గారు ఇంకోసారి అంగీకరించారు. మధ్య మధ్య కాస్త కన్ఫ్యూజ్ అయి ఇలా వాస్తవాలు తనకు తానే బయట పెడుతుంటాడు. ఎందుకు ఓడిపోయానో తనకు అర్థం కావడం లేదని మొన్నటి వరకు గోల పెట్టాడు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 5, 2019