అక్కినేని నాగార్జున హోస్ట్‌గా 100 రోజులకు పైగా సాగిన బిగ్‌బాస్ సీజన్ – 3 ట్రోఫీని సింగర్ రాహుల్ స్లిప్గంజ్ గెల్చుకోగా, రన్నరప్‌గా ప్రముఖ యాంకర్ శ్రీముఖి నిలిచింది. అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ బిగ్‌బాస్ షోలో విజేతగా శ్రీముఖినే గెలుస్తుందని అనుకున్నారు. ఆమె అభిమానులు కూడా శ్రీముఖి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే కామ్‌గా ఉండే రాహుల్ ప్రేక్షకుల ఓట్లతో టైటిల్ ఎగరేసుకుపోయాడు. మెగాస్టార్ చిరంజీవి రాహుల్‌కు ట్రోఫితో పాటు 50 లక్షల చెక్ అందజేశారు. అయితే ఈ 50 లక్షల్లో ట్యాక్స్‌లు పోనూ రాహుల్‌కు దక్కింది కేవలం 35 లక్షలే..కాగా రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి మాత్రం విన్నర్ రాహుల్ కంటే రెట్టింపు రెమ్యూనరేషన్ సొంతం చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తెలుగులొ టాప్ యాంకర్లలో ఒకరైన శ్రీముఖికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా టాలెంట్, మంచి అందం, గ్లామర్‌తో పాటు అల్లరి, చలాకీతనం శ్రీముఖికి ప్లస్ పాయింట్.. తెలుగు రాష్ట్రాల్లో శ్రీముఖికి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఒక షో చేస్తే ఒక కాల్షీట్కు లేదా ఒక రోజుకు లక్ష వరకు రెమ్యూనరేషన్ అందుతుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది..కాగా శ్రీముఖికి ఉన్న క్రేజ్ దృష్ట్యా బిగ్‌బాస్ నిర్వాహకులు ఆమెకు రోజుకు లక్ష రెమ్యూనరేషన్ ఇచ్చి షోలోకి తీసుకున్నారు. అంటే 105 రోజులకు కోటి 5 లక్షలకు పైగా ముట్టింది..అంటే రాహుల్‌కు కట్ అయిన ట్యాక్స్‌ల ప్రకారం చూసుకున్నా శ్రీముఖికి ఏకంగా రూ. 75 లక్షలు ముట్టిందని సమాచారం. అంటే విన్నర్ రాహుల్‌కు కంటే రెట్టింపు డబ్బులు శ్రీముఖికి దక్కాయన్న మాట.ఈ లెక్కన చూసుకుంటే..పేరుకు బిగ్‌బాస విన్నర్ రాహుల్ అయినా..మనీపరంగా శ్రీముఖినే విన్నర్ అంటూ ఆమె అభిమానులు అంటున్నారు.
