40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు చేయలేని ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు కేవలం 40 ఏళ్ల వయసు ఉన్న జగన్ మోహన్ రెడ్డి చేయడం చూసి చంద్రబాబు ఓర్వలేక కడుపుమంటతో మండిపడుతున్నారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు ఇప్పుడు దళితులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడడం చూస్తే విడ్డూరంగా ఉంది. దళితులను మాల, మాదిగలుగా విడగొట్టిన ఘనుడు చంద్రబాబు. బాబు పాలనలో తప్పుడు కేసులు పెట్టించి దళితులను భయభ్రాంతులకు గురిచేసి, తనకు అవసరం వచ్చినప్పుడల్లా సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు కళ్యాణ్ తో షో చేయించి ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారంటూ వైసిపి విమర్శిస్తోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు దళితులను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మారేసరికి దళితులపై ఎక్కడలేని ప్రేమ చూపిస్తుంది అంటూ వైసిపి నేతలు చంద్రబాబును విమర్శిస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఉ ఉ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు దళితుల గురించి మాట్లాడను అత్యంత హాస్యాస్పదంగా ఉందని చెబుతున్నారు.