తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పార్టీ కార్యక్రమాలలో చెప్పడమే కాకుండా ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడంలో ముందుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మరోసారి నిరూపించారు.
గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ బట్టుపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దేశిని రవీందర్ తీవ్ర అనారోగ్యంతో భాదపడుతుండడంతో ఆయనను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ .
ఆయన వైద్యానికి అయిన ఖర్చులను సైతం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రవీందర్ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అరూరి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇండ్ల నాగేశ్వర్ రావు, కూడా అడ్వైజరీ కమిటీ మెంబర్ వనం రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 281