గత ప్రభుత్వ హయంలో ప్రైవేట్ స్కూల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. ప్రభుత్వ స్కూల్స్ ను పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం పేరుతో ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని ప్రైవేట్ సంస్థలో చదివిస్తున్నారు. ఈపరంగా కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్ లాభపడుతున్నారు. ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని సంచలన నిర్ణయం తీసుకుంటే దానిపై బురద జల్లుతున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా “ఇంగ్లిష్ మీడియం కోసమే పిల్లలను కార్పోరేటు స్కూళ్లకు పంపిస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు పేద ప్రజలు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెడుతామని జగన్ గారు చెబ్తుంటే వద్దంటున్న వారు ఎవరి మేలు కోరుతున్నారో స్పష్టం చేయాలి? కార్పోరేట్ స్కూళ్లు నష్ట పోతాయనేనా మీ అక్కసంతా?” అని అన్నారు.
