Home / ANDHRAPRADESH / సీఎం జగన్ పై దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ పై దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన నేత,మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం.

అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని “ఆరోపిస్తున్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” వైసీపీ నేతలు,ఎమ్మెల్యేలు అభద్రతా భావంలో ఉన్నారు. అందుకే తమ పార్టీ నాయకులను,ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో నీతులు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయకపోయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీను ఎలా పార్టీలో చేర్చుకున్నారని “అన్నారు. అయితే మరోవైపు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ కేవలం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు ఇస్తానని మాత్రమే చెప్పిన సంగతి విదితమే.