వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ ను సంపాదించుకుని టాప్ హీరోలలో ఒకరిగా రాణిస్తోన్న స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తోన్న సంగతి విదితమే.
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది. ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడని తెలుస్తోంది.
జక్కన్న మూవీ విడుదల తర్వాత వచ్చే ఇమేజ్ ను బ్యాలెన్స్ చేయాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తే బాగుంటదని ఎన్టీఆర్ సన్నిహితులు సూచించడంతో జూనియర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.