వినడానికి .. చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లా నారాయణ పేటకు చెందిన భక్తల అడివయ్య,జ్యోతి దంపతులు దాదాపు పదేళ్ల కిందట ఉపాధి కోసం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బాలయ్య నగర్లో నివస్తున్నారు.
ఈ క్రమంలో నిన్న ఆదివారం రోజు ఉదయం టీ పెట్టమని తన భార్య అయిన జ్యోతిని అడిగాడు. దీనికి స్పందనగా భార్య జ్యోతి కొద్ది సేపటి తర్వాత పెడతాను బదులిచ్చింది.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అడివయ్య మద్యం సేవించి దగ్గరలో ఉన్న క్యారీ గుంతలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.