మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. చదువు విషయంలో కూడా మత కలహాలు సృష్టిస్తున్నారు అనే విషయంలో చంద్రబాబు పై ధ్వజం ఎత్తారు. రాష్ట్రం మొత్తం తెలిసేలా ట్విట్టర్ వేదికగా ఆయనను ఆడుకున్నారు. “మతం మార్చడానికే ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారని కుల మీడియా, చంద్రబాబు, ఆయన దొంగల బ్యాచ్ గోల పెట్టడం 5 కోట్ల మంది ప్రజలను అవమానించడమే. వీళ్ల నీచ ఆరోపణలతో 1.80 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, 50 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యారు” అని మండిపడ్డారు. చంద్రబాబు అండ్ బ్యాచ్, కుల మీడియా ఎవరికీ ఎప్పటికీ బుద్ధి రాదనీ అన్నారు.
