రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. కులం, మతం అనే తేడా లేకుండా ప్రతీఒక్కరికి అండగా నిలుస్తున్నాడు సీఎం జగన్. తాను అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మత్స్యకారులకు శుభవార్త చెప్పారు.”దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఇచ్చిన ప్రతిహామీని బాధ్యతగా నెరవేరుస్తున్నాం. మత్స్య దినోత్సవం సందర్భంగా వైయస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వేటనిషేధ పరిహారం రూ.10,000,డీజిల్ సబ్సిడీ రూ.9కి పెంపు,వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందిస్తాం” అని అన్నారు.
దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఇచ్చిన ప్రతిహామీని బాధ్యతగా నెరవేరుస్తున్నాం. మత్స్య దినోత్సవం సందర్భంగా వైయస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వేటనిషేధ పరిహారం రూ.10,000,డీజిల్ సబ్సిడీ రూ.9కి పెంపు,వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందిస్తాం.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2019