ముగిసిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఒక అధికార పార్టీ అయిన టీడీపీకి కనీస సీట్లు కూడా రాలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు వారి పాలన ఎంత అవినీతికి చేరిందో. 2014 ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేసి చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని తన సొంత పనులకే ఉపయోగించుకున్నాడు తప్పా రాష్ట్రానికి మాత్రం ఏమీ చెయ్యలేదు. బడా నాయకులు అంతా రాజధాన్ని పేరుతో కొన్ని వేలకోట్లు నొక్కేసారు.
అందుకనే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీఒక్కరు భయానికి గురయ్యారు. జగన్ ప్రతీఒక్క అవినీతి నాయకుడ్ని బయటకు లాగుతాడని తెలుసుకొని అందరు బీజేపీలోకి వలస వెళ్తున్నారు. ఇందులో సుజనా చౌదరి విషయానికి వస్తే వైసీపీ నేత విజయసాయి రెడ్డి అతడిపై మండిపడడమే కాకుండా జనానికి ఒక నిజాన్ని కూడా తనతోనే చెప్పించాడు. నిన్న సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపి) వేరు… అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్ధమయింది అని అన్నారు. నిజంగా ఆయన మాటలు చూస్తే అలానే అనిపిస్తుంది మరి. ఇలా అయితే రెండుగా చీలిన బీజేపీ..ఒకటి బాబు భక్తుల బీజేపీ.. రెండు అసలైన కాషాయనాథుల బీజేపీ.. అని చెప్పాలి.