Home / MOVIES / “సరిలేరు నీకెవ్వరు” టీజర్ పై నెటిజన్లు సెటైర్లు

“సరిలేరు నీకెవ్వరు” టీజర్ పై నెటిజన్లు సెటైర్లు

టాలీవుడ్ అగ్రహీరో ..సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, కన్నడ భామ హాటెస్ట్ బ్యూటీ రష్మిక మంధాన జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో ఏకే ఎంటర్ ప్రైజెస్ ,శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంయుక్తంగా రాంబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.లేడీ అమితాబ్,నాటి హాటెస్ట్ బ్యూటీ విజయశాంతి,ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్,అజయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

మరోపక్క సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేసింది. దుమ్ములేపుతుంది..ఈ టీజర్లో కీ రోల్ లో నటిస్తోన్న విజయశాంతి దగ్గర నుండి అజయ్ ,ప్రకాష్ రాజు,రాజేంద్రప్రసాద్ అందరూ కన్పించారు కానీ మెయిన్ రోల్ అయిన హీరోయిన్ రష్మిక మంధాన,గతంలో దర్శకుడు అనీల్ రావిపూడి ప్రకటించిన రీఎంట్రీ ఇస్తాడన్నా బడా నిర్మాత,కమెడియన్ బండ్ల గణేష్ కన్పించలేదు .

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ” మూవీలో అందాలను ఆరబోసే మా రష్మిక మంధాన ఎక్కడా బాబు.. అంటూ రష్మిక మంధాన అభిమానులు బాధపడుతున్నారు. మరో వైపు నెటిజన్లు” బాబు అనీల్ రావి పూడి మా బండ్లన్న రీఎంట్రీ ఇస్తాడు అన్నావు. మరి ఈ టీజర్లో లేడు కదా.. మా బండ్లన్న ఎక్కడ అన్న అని నెటిజన్లు టీజర్ పై సెటైర్లు వేస్తోన్నారు.