Home / NATIONAL / శరద్ పవార్ బిజేపికి సపోర్ట్ చేస్తారా..?

శరద్ పవార్ బిజేపికి సపోర్ట్ చేస్తారా..?

సినిమా స్టోరిని తలపిస్తున్నాయి మహారాష్ట్ర రాజకీయాలు..నిన్నటి నిన్న శివసేన తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్సీపి అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు..కానీ ఉదయాన్నే రాజ్ భవన్ లో ఎన్సీపి నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా,బిజేపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు..ఎన్సీపిలో మెజార్టీ ఎమ్మేల్యేలు బిజేపీ కి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా అజిత్ పవార్ స్పష్టం చేశారు..మహారాష్ట్రలో ఉన్న రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తు ఈ రోజు ఉదయం ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి..అస్సలు బిజేపీ కి ఎన్సీపి సపోర్ట్ ఇవ్వలేదని,అది అజిత్ పవార్ సొంత నిర్ణయమని ఎన్సీపి అధినేత శరత్ పవార్ ఒక ట్వీట్ చేశారు..దీంతో మళ్లీ మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం మొదలైంది..శివసేన నాయకుడు సంజయ్ రౌతు కూడా అజిత్ పవార్ ,శరద్ పవార్ ను దొండదెబ్బ తీసాడని వాఖ్యానించారు..

 

 

 

ఈ విషయంలో శరద్ పవార్ కు ఎలాంటి సంబందం లేదని శివసేన నమ్ముతుందని ఆయన స్పష్టం చేశారు..కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇదంతా శరద్ పవార్ ఆడుతున్న నాటకమని ప్రచారం చేస్తున్నారు..నాయకుడి కి తెలవకుండా రాత్రికిరాత్రే సమీకరణాలు మారతాయా అని ప్రశ్నిస్తున్నారు..మరో పక్క బీజేపి కేంద్ర మంత్రి అథవాలే ఆసక్తికర వాఖ్యలు చేశారు..మహారాష్ట్ర లో బీజేపి ప్రభుత్వం ఏర్పడుతుందని నాకు ముందే తెలుసని,కేంద్ర మంత్రి వర్గంలో ఎన్సీపి నాయకులకు ఇద్దరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు..గవర్నర్ కూడా ఫడ్నవీస్ ప్రభుత్వ బలనిరూపణకు నవంబర్ 30వరకు గడువు ఇచ్చారు..ఈ లోపు శరద్ పవార్ నిర్ణయం మారే అవకాశము లేకపోలేదు..ఒక వేళ శరద్ పవార్ మాట వినకపోతే ఎన్సీపీలో కూడా చీలికలు వచ్చే అవకాశం ఉందని వినికిడి.. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ లో బిజేపీకి 105,శివసేనకు 56,ఎన్సీపికి 54,కాంగ్రెస్ కు 44 సభ్యులున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat