టీమిండియా దిగ్గజ ఆటగాడు,మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ మగాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ మాట్లాడుతూ” మగాళ్లందరూ వివాహానికి ముందు సింహాలు మాదిరిగానే ఉంటారు. కానీ ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత మాత్రం భార్యల మాట వినాల్సిందే అని ధోనీ సరదాగా వ్యాఖ్యానించారు.
వివాహాం చేసుకునేంత వరకూ అందరూ మగాళ్లు సింహాల్లాంటి వాళ్ళే. ఆ తర్వాతే అంతా మారిపోతుంది. నేను ఆదర్శ భర్త లాంటి వాణ్ని. అన్నీ నా భార్య చేసేలా చూసుకుంటా .. ఆమె సంతోషంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను అని నాకు తెల్సు.
ఆమె చెప్పిన ప్రతిదానికి నేను సరేనంటే ఆమె సంతోషంగా ఉంటుంది. యాబై ఏళ్ళు దాటిన తర్వాతే పెళ్ళికి నిజమైన ఆర్ధం తెలుస్తుంది. ప్రేమకు సరైన వయసు యాబై ఐదేళ్లు అని చెప్పగలను “అని అన్నారు.