టీమిండియా స్పీడ్ గన్ .. పరుగుల మిషన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా అన్ని పార్మెట్లలో పరుగుల సునామీ కురిపిస్తున్న సంగతి విదితమే.
ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ పై ఆసీస్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ”టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టు మ్యాచ్ లో నాలుగు వందల పరుగుల రికార్డును బద్దలు కొడతాడని “అన్నారు.
హిట్ మ్యాన్ పై తనకు నమ్మకముందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తప్పకుండా ఏదో ఒక రోజు రోహిత్ శర్మ ఈ ఘనతను సాధిస్తాడని చెప్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ టెస్టుల్లో 335పరుగులు చేయడంతో ఆసీస్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రెండో ఆటగాడిగా వార్నర్ నిలిచాడు.