చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలకు ఏమీ చేసిందిలేదనే చెప్పాలి. ఎందుకటే 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి, చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. మరోపక్క ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికారం వచ్చిందనే అహంకారంతో విచ్చలవిడిగా నచ్చినట్టు టీడీపీ నాయకులు వ్యవహరించారు. ఇక రాజధాని విషయానికి వస్తే అది పెద్ద మాఫియ అనే చెప్పాలి. అమరావతి పరిసర ప్రాంతాల రైతులను మోసం చేసి వారి భూములు లాక్కొని అన్యాయం చేసారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “రాజధాని గురించి చంద్రబాబు పర్సనల్‌గా ఎందుకు తీసుకుంటున్నాడో ప్రజలకు బాగా అర్థమైంది. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయనేదే అయన ప్రధాన బాధ. ల్యాండ్ మాఫియా కోసమే రాజధాని పర్యటన, రౌండ్ టేబుల్ సమావేశాలు. ప్రజల కోసం ఏనాడు పనిచేసింది లేదు” అని అన్నారు.
