తెలంగాణతో పాటు యావత్తు దేశమంతా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం,హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి విదితమే.
ఈ సంఘటనపై పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు. తాజాగా ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఈ క్రమంలో తన అధికారక ట్విట్టర్ వేదికగా ” దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై స్పందిస్తూ” న్యాయ వ్యవస్థలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా నేరస్తుల ఆపరాధాన్ని నిరూపించాలి.
పోలీసుల వాదనలు,మీడియా ఊహగానాలు,ప్రజల ఆవేదనల ఆధారంగా నేరస్తులకు శిక్షలు వేయడం ప్రారంభిస్తే సమాజం కూలిపోతుంది”అని ట్వీట్ చేశాడు.